అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మతిపరుపు, తడబాట్ల కారణంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ విమర్శల పాలవుతున్నారు. ఏదో ఒక పొరపాటు చేస్తూ మీడియాకు చిక్కుతున్నారు. తాజాగా వైట్‌హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ను ప్రెసిడెంట్ అంటూ సంభోదించి మరోసారి నోరు జారి నవ్వులపాలయ్యారు. గత జూన్‌లో స్టాన్లీ కప్ గెలిచిన వెగాస్ గోల్డెన్ నైట్స్ టీమ్‌ను సత్కరించేందుకు వైట్‌హౌస్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బైడెన్ ఆటగాళ్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అనబోయి ప్రెసిడెంట్ అంటూ సంభోదించారు. దీంతో కార్యక్రమానికి హాజరైన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అదికాస్తా వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు బైడెన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.














