అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన మతిమరుపుతో మరోసారి వార్తల్లో నిలిచారు. చిప్స్ అండ్ సైన్స్ చట్టంపై సంతకం చేసే సందర్భంగా బైడెన్ మతిమరుపు మరోసారి బయటపడిరది. ఈ కార్యక్రమంలో సెనేట్ మెజార్టీ లీడన్ చక్ షూమర్ అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. బైడెన్‌కు కూడా ఇచ్చి, పక్కన ఉన్న వారికి కూడా షేక్ హ్యాండ్ ఇచ్చారు. అప్పటికి తను షేక్ హ్యాండ్ ఇచ్చిన విషయం మర్చిపోయిన బైడెన్ మరోసారి షేక్ హ్యాండ్ కోసం చెయ్యాజాపరు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. గతంలో కూడా ఒకసారి ఎవరూ లేకుండానే గాల్లో ఎవరికో షేక్ హ్యాండ్ ఇస్తూ బైడెన్ కనిపించిన సంగతి తెలిసిందే.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)