కరోనా వైరస్ తొలిసారి సొకినప్పుడు ఇన్‌ఫెక్షన్ తీవ్రత ఎక్కువగా ఉంటే, యాంటీబాడీలు అధిక కాలం పాటు రక్షణ కల్పిస్తాయని పరిశోధకులు, నిపుణులు తేల్చారు. అయితే మొదటిసారి ఇన్‌ఫెక్షన్ తీవ్రత ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా వ్యక్తులు రెండోసారి కరోనా బారిన పడకుండా దాదారు ఆరు నెలల వరకు రక్షణ ఉంటుందని అమెరికాలో మిషిగన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తాజాగా నిర్ధారించారు. మొత్తం 130 మందిపై వారు ఓ అధ్యయనాన్ని నిర్వహించారు. కరోనా వైరస్‌ను సమర్థంగా నిలువరించే యాంటీబాడీలు 90 శాతం మందిలో తొలిసారి ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యాక దాదాపు 6 నెలల వరకు సమర్థంగా పనిచేశాయని గుర్తించారు. తొలి ఇన్‌ఫెక్షన్ తీవ్రత వాటిపై ప్రభావం చూపలేదని తెలిపారు.