దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు. సిడ్నీలో బీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా శాఖ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ గరి రాపోలు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మహేశ్ బిగాల మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి ఏర్పాటు గురించి ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా చర్చిస్తున్నారని పేర్కొన్నారు. దేశాన్ని ముందు వరుసలో నిలపడం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని అన్నారు. మునుగోడులో టీఆర్‌ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవడం ఖామని అన్నారు. ఒక కాంట్రాక్టర్ కోసం జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్సీ సురభి వాణి మాట్లాడుతూ తెలంగాణ పై ఎన్‌ఆర్‌ఐలు చూపిస్తున్న అమితమైన ప్రేమ ఎంతో గొప్పదని దీనిని వెలకట్టలేమని అన్నారు.
ఈ సమావేశంలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి, సభ్యులు వెంకట రమణారెడ్డి మర్రి, మొహమ్మద్ ఎజాజ్, భోజి రెడ్డి, మధు కలం, ప్రవీణ్ జంబుల, నిఖిల్ గడ్డమీద, రవీందర్ చింతామణి, పరశురామ్ ముతుకుల , కిషోర్ బెందే, లక్ష్మణ నల్ల, రాహుల్ రాంపల్లి, సాంబ శివ మల్గారి, మొహమ్మద్ ఇస్మాయిల్ పాల్గొన్నారు.