కువైత్ ప్రభుత్వం టూరిస్ట్ వీసాపై కీలక నిర్ణయం తీసుకుంది. జీసీసీ (గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్) దేశాలలోని విదేశీ నివాసులతో పాటు మరో 53 దేశాల వారికి మాత్రమే టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం వచ్చింది. పర్యాటక వీసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు భారత పౌరులకు మాత్రం అవకాశం లేదు. ఇక టూరిస్ట్ ఈ`వీసా, ఆన్‌లైన్ చెల్లింపుల కోసం మంత్రిత్వశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేక ఆప్షన్‌ను జత చేసినట్లు అధికారులు వెల్లడిరచారు. జీసీసీ దేశాల్లో (సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, యూఏఈ, ఒమన్, కువైత్) ఆరు నెలల కంటే ఎక్కువ నివాసం ఉన్న ప్రవాసులతో పాటు 2008లో తీసుకువచ్చిన మంత్రివర్గం తీర్మానం నం. 220 ప్రకారం ప్రత్యేక వృత్తులు కలిగిన వారు టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు అంతర్గత మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)