రామ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం స్కంద. రామ్‌కు జోడీగా శ్రీలీల నటించింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. థమన్ స్వర పరిచిన ఈ మాస్ గీతాన్ని హేమచంద్ర, రమ్య బెహరా, మహా ఆలపించారు. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. ఇక రామ్ పోతినేని ఎప్పటిలానే తన ఎనర్జిటిక్ స్టెప్స్‌తో ఊపేశాడు. ఇక ఈ స్పెషల్ సాంగ్‌లో బాలీవుడ్ ఐటెం గర్ల్ ఊర్వశి రౌటెలా నర్తించింది. ఈ స్పెషల్ సాంగ్ కూడా ఆ చార్ట్ బస్టర్ లిస్ట్‌లో చేరుతుందని మేకర్స్ తెలుపుతున్నారు. ఈ నెల 28న విడుదల కానుంది. సాయిమంజ్రేకర్, శ్రీకాంత్, గౌతమి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సంతోష్ డిటాకే, సంగీతం: తమన్, రచన-దర్శకత్వం: బోయపాటి శ్రీను.