Namaste NRI

మూడు నెలల తర్వాత ఓపెన్‌… అయినా హౌస్‌ఫుల్‌

మూడు నెలలకుపైగా రష్యా కొనసాగిస్తోన్న భీకర యుద్ధంతో ఉక్రెయిన్‌ నగరాలు వణికిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో మూడు నెలల తర్వాత ఓ థియేటర్‌ తిరిగి తెరుచుకుంది. అయితే, ప్రదర్శన మొదలు పెట్టిన తొలిరోజే మూడు ఆటలకు సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడుపోవడం విశేషం. ఇదే సమయంలో రాజధాని కీవ్‌పై దాడి చేసినప్పటికీ ఉక్రెయిన్‌ సేనల ప్రతిదాడులతో తిరిగి వెనక్కి వెళ్లిపోయాయి.  ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కీవ్‌లో రోజువారీ కార్యక్రమాలు తిరిగి ప్రారంభమవుతున్నాయి.  వీటితోపాటు సినిమా థియేటర్లు, నేషనల్‌ ఒపేరా వంటి ప్రదర్శనశాలలు తిరిగి తెరుచుకుంటున్నాయి. ఇందులో భాగంగానే కీవ్‌ శివారులోని పొదిల్‌ ఉన్న ఓ థియేటర్‌ కూడా ప్రదర్శనను మొదలు పెట్టింది.  యుద్ధం కొనసాగుతున్న వేళ ప్రేక్షకులు థియేటరకు వస్తారో? లేదా అని భావించాం. అసలు థియేటర్‌ గురించి ఆలోచిస్తారా అసలు ఆసక్తి ఉందా? అని అనుకున్నాం. కానీ తొలిరోజు మూడు ఆటలకు సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడుపోవడం ఎంతో సంతోషంగా ఉంది అని నటుల్లో ఒకరైన యురియ్‌ ఫెలిపెంకో పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events