Namaste NRI

ఈ నెల 22న ఓపెన్ హౌస్ .. ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన

ఈ నెల 22న ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కువైత్‌లోని ఇండియన్‌ ఎంబసీ కీలక ప్రకటన చేసింది. కువైత్‌లో పని చేస్తున్న ఇంజినీర్లు, నర్సుల సమస్యలపై ఈ కార్యక్రమంలో అంబాసిడర్‌ సిబి జార్జి చర్చించనున్నట్టు తెలిపింది.  ఎంబసీ కార్యాలయంలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసే ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరు కావొచ్చని తెలిపింది. ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమంలో ఆన్‌లైన్‌ ద్వారా పాల్గొనదలచిన భారతీయులు  [email protected]కు మెయిల్‌ పంపి రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించింది. భారతీయులు ఎవరైనా ఇతర సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే.. వారి సమస్యను పాస్‌పోర్ట్‌ నెంబర్‌, పేరు, సివిల్‌ ఐడీ నెంబర్‌, ఫోన్‌ నంబర్‌ వివరాలతో మెయిల్‌ చేయాలని తెలిపింది. కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వారు మాత్రమే ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాన్నికి హాజరు కావాలని తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events