Namaste NRI

ఆర్గానిక్‌ మామ హైబ్రిడ్‌ అల్లుడు పెద్ద హిట్‌ అవుతుంది : కృష్ణారెడ్డి

ఎస్వీ కృష్ణారెడ్డి దర్వకత్వంలో రాజేంద్రప్రసాద్‌, మీన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఆర్గానిక్‌ మామ హైబ్రిడ్‌ అల్లుడు. కోనేరు కల్పన నిర్మాత. సోహెల్‌, మృణాళిని జంటగా నటిస్తున్నారు. టీజర్‌, ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఆవిష్కరించారు. ఎస్వీ  కృష్ణారెడ్డి మాట్లాడుతూ కరోనా టైమ్‌లో ఈ కథ తయారు చేశా. మాటలు కూడా నేనే రాశాను. 44 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశాం. రాజేంద్రప్రసాద్‌ డబ్బింగ్‌ టైమ్‌లో కొన్ని సీన్లు చూసి పాత్రలో అన్ని ఎమోషన్స్‌ ఉన్నాయా? అంటూ ఆశ్చర్యపోయారు. నా తరహా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అన్నారు. చిన్నప్పటి నుంచి తాను ఎస్వీ కృష్ణారెడ్డి చిత్రాల్ని చూస్తూ పెరిగానని, ఆయన దర్శకత్వంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని సోహెల్‌ తెలిపారు. మామా, అల్లుడు ఫార్ములా హిట్‌ ఫార్ములా. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది అని ఆలీ తెలిపారు.  దర్శకుడు కృష్ణారెడ్డి మార్క్‌తో ప్రస్తుత జనరేషన్‌కు పర్‌ఫెక్ట్‌గా సరిపోయే సినిమా ఇది అన్నారు నిర్మాత కె. అచ్చిరెడ్డి. నా చిన్నప్పటి నుంచి కృష్ణారెడ్డిగారి సినిమాలు చూస్తూ పెరిగిన నేను ఆయన దర్శకత్వంలో నటించాను అనే నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నన్ను నమన్మి అవకాశం ఇచ్చిన కల్పనగారి ధన్యవాదాలు అన్నారు సోహైల్‌. ఈ కార్యక్రమంలో సోహెల్‌, అలీ, అచ్చిరెడ్డి, హేమ, ప్రసన్న కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events