ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ 81వ స్నాతకోత్సవం ఈ ఏడాది అక్టోబర్ రెండో వారంలో నిర్వహించేందుకు ఓయూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2018, జులై నుంచి 2020, జూన్ వరకు పోస్టు గ్రాడ్యుయేషన్‌తో పాటు ఎంఫీల్, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు డిగ్రీ అవార్డులతో పాటు బంగారు పతకాలను ప్రదానం చేయనున్నారు. 2021, సెప్టెంబర్ 30వ తేదీ వరకు పీహెచ్‌డీ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ విద్యార్థులకు ఆయా కాలేజీలు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేస్తాయని అధికారులు వెల్లడిరచారు. స్నాతకోత్సవానికి సంబంధించిన ఇతర వివరాల కోసం షషష.శీంఎaఅఱa.aష.ఱఅ వైబ్ సైట్ ను సందర్శించొచ్చు.