Skip to main content

Namaste NRI

మన డాక్టర్ బాబే విజయం సాధించాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజ్ తరుణ్, అలీ

శ్రీస్కంద హీరోగా నటిస్తున్న చిత్రం మన డాక్టర్‌ బాబే. మోహన సిద్ధి, శృతిశంకర్‌, అలీ, రాజీవ్‌ కనకాల, శాంతి, కోటేశ్వరరావు కీలక పాత్రధారులు. చలపతికుమార్‌ దర్శకుడు. కృతాక్షి నిర్మాత. ఈ సందర్భంగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ప్రముఖ హీరో రాజ్‌తరుణ్‌ ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఈ కార్యక్రమంలో నటుడు అలీ మాట్లాడుతూ చలపతి మీద నమ్మకంతో శ్రీ స్కంద తన సొంత డబ్బు పెట్టి ఈ సినిమాను నిర్మించారని, వారి కష్టాన్ని తాను దగ్గరగా చూశానని తెలిపారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అని ప్రేక్షకులు చూడరని, బలమైన కథ, కంటెంట్ ఉంటే కచ్చితంగా విజయం అందిస్తారని అన్నారు. నవంబర్ 20న విడుదలవుతున్న మన డాక్టర్ బాబే చిత్రాన్ని అందరూ ఆదరించి సక్సెస్ చేయాలని కోరారు. ముఖ్య అతిథి రాజ్ తరుణ్ మాట్లాడుతూ, హీరోగా, నిర్మాతగా వస్తున్న శ్రీ స్కందకు శుభాకాంక్షలు తెలిపారు. అలీతో కలిసి స్టేజ్ పంచుకోవడం సంతోషంగా ఉందని, దర్శకుడు చలపతికి మంచి విజయం దక్కాలని, నవంబర్ 20న థియేటర్లలో సినిమాను చూసి ఆదరించాలని ఆకాంక్షించారు.

హీరో శ్రీస్కంద తొలి సినిమా అయినా అద్భుతంగా నటించారని, నిర్మాత రాజీ లేకుండా సినిమాను నిర్మించారని, అందరూ మెచ్చే విభిన్న కథాంశంతో రూపొందిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందని దర్శకుడు చలపతికుమార్‌ నమ్మకంగా చెప్పారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు. ఈ నెల 20న సినిమా విడుదల కానున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events