విశ్వక్సేన్, మిథిలా పాల్కర్, ఆశాభట్ హీరో హీరోయిన్లుగా నటించిన కొత్త సినిమా ఓరి దేవుడా. అశ్వత్ మారిముత్తు దర్శకుడు. పీవీపీ సినిమా సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్టార్ హీరో వెంకటేష్ ఇందులో దేవుడు పాత్రలో నటించారు. ఈ సినిమా దీపావళి కానుకగా విడుదలై సూపర్ హిట్ టాక్ అందుకుంది. హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విశ్వక్సేన్ మాట్లాడుతూ ప్రేక్షకులు మాకు పూర్తి మార్కులు ఇచ్చారు. వెంకటేష్ గారితో కలిసి నటించడం కల నిజమైన అనుభూతిని ఇస్తున్నది. ఆయన తెరపై కనిపించిన ప్రతి సన్నివేశాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ సినిమాను మీతో పాటే థియేటర్లో చూశాను. ఆడియోన్స్ స్పందన సంతోషాన్ని ఇస్తున్నది అన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వంశీ కాకా మాట్లాడుతూ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఇదొక యూత్‌ఫుల్ ఫిలిం. భావోద్వేగాలు ఉన్నాయి. నటీనటుల పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటున్నది. థియేటర్లోకి వచ్చిన ప్రతి ఒక్కరినీ మూవీ అలరిస్తుం అన్నారు. ఈ కార్యక్రమలో విశ్వక్సేన్, హీరోయిన్లు, దర్శకుడు అశ్వత్మారిముత్తు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వంశీ కాక తదితరులు పాల్గొన్నారు.














