నార్నే నితిన్, రామ్ నితిన్, గౌరీ ప్రియారెడ్డి, అనంతిక సునీల్‌కుమార్, గోపిక ఉద్యాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మ్యాడ్. కల్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రాన్ని హారిక సూర్యదేవర నిర్మించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ అందరూ కొత్తవాళ్లు కలిసి చేసిన ప్రయత్నమిది. తప్పకుండా ప్రేక్షకులు ఇష్టపడతారనే నమ్మకంతో ప్రమోట్ చేశాం. భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. దాంతో ఈ తరహా సినిమాలు చేయడానికి మరింత ధైర్యం వచ్చింది అన్నారు. చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో రాబోవు రోజుల్లో మరిన్ని కలెక్షన్స్ పెరుగుతాయని భావిస్తున్నాం. అన్ని కేంద్రాల్లో అద్భుతమైన ఆదరణ దక్కుతున్నది. ఈ సినిమా విషయంలో మా అంచనాలన్నీ నిజమయ్యాయి అన్నారు.
దర్శకుడు కల్యాణ్ శంకర్ మాట్లాడుతూ తన తొలి చిత్రానికే ఈ స్థాయి స్పందన రావడం ఆనందంగా ఉందని అన్నారు. సినిమా బాగా ఆడుతుందని ముందే ఊహించామని, ఆసాంతం చక్కటి వినోదంతో అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్నదని హీరోలు నార్నే నితిన్, సంతోష్ శోభన్, రామ్ నితిన్ ఆనందం వ్యక్తం చేశారు.