Namaste NRI

ఈ సినిమా విషయంలో మా అంచనాలు నిజమయ్యాయి : పవన్‌కల్యాణ్‌

పవన్‌కల్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయమైన కమర్షియల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ పురుషః. వీరు వులవల దర్శకత్వం. బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సినిమా థ్యాంక్స్‌ మీట్‌ని హైదరాబాద్‌లో మేకర్స్‌ నిర్వహించారు. తన నటనకు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభిస్తున్నదని, ఈ క్రెడిట్‌ దర్శకుడిదేనని, ఈ సినిమా విషయంలో మా అంచనాలు నిజమయ్యాయని, సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్‌లతో నటించడం గొప్ప అనుభవమని, సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలని హీరో పవన్‌కల్యాణ్‌ బత్తుల అన్నారు.

పవన్‌కల్యాణ్‌ బత్తుల హీరోగా ఇంకో రెండు సినిమాలు నిర్మించనున్నట్టు నిర్మాత బత్తుల కోటేశ్వరరావు చెప్పారు. ఇది మా టీమ్‌ సమిష్టి కృషివల్ల దక్కిన విజయమని దర్శకుడు వీరు వులవల పేర్కోన్నారు. ఇంకా కసిరెడ్డి రాజ్‌కుమార్‌, రాయంచ, విషిక, హాసిని సుధీర్‌, సంధ్య డీవోపీ సతీశ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ రవి కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News