అయిదేళ్ల క్రితం వచ్చి విజయం సాధించిన మత్తువదలరా చిత్రానికి సీక్వెల్గా రూపొందిన చిత్రం మత్తు వదలరా 2. శ్రీసింహా కోడూరి, సత్య, ఫారియా అబ్దుల్లా లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకుడు. మైత్రీ మూవీమేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై చిరంజీవి(చెర్రి), హేమలత పెదమల్లు నిర్మించిన ఈచిత్రం ఈ నెల 13న విడుదలై థియేటర్లలో ప్రదర్శింపబడుతున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన థ్యాంక్స్మీట్లో హీరో శ్రీసింహా మాట్లాడుతూ మా సినిమాను అనుకున్నదానికంటే పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. పార్ట్ 3 కోసం మీలాగే నేనూ ఎదురుచూస్తున్నా అన్నారు. ఈ సినిమాను ఒక మంచి స్ట్రెస్ బస్టర్ అని చాలామంది అంటున్నారని నిర్మాత తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 30కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందీ సినిమా. దసరా సెలవల్లోనూ ఈ రన్ కంటిన్యూ అవుతుందని నమ్ముతున్నాం. ఇదే ఉత్సాహంతో మత్తువదలరా 3 బ్రహ్మాండంగా చేస్తాం అని నిర్మాత వై.రవిశంకర్ తెలిపారు.