Skip to main content

Namaste NRI

మా విధానం మార‌దు.. అమెరికాకు మ‌రోసారి స్ప‌ష్టం చేసిన ఇరాన్

ఇరాన్‌పై అమెరికా మ‌రోసారి దాడికి సిద్ద‌మ‌వుతోంది. ఈ మేర‌కు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో ఇరాన్ స్పందించింది. విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మాట్లాడారు. ఇరాన్‌పై అమెరికా మ‌ళ్లీ సైనిక చ‌ర్య‌కు దిగినాస‌రే, మా విధానాలు మార‌బోవు. ప్ర‌స్తుతం యుద్ధం గురించిన చ‌ర్చ న‌డుస్తోంది. యుద్ధం మ‌ళ్లీ ప్రారంభం కావొచ్చ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. యుద్ధం జ‌రిగినా, జ‌ర‌గ‌క‌పోయినా మా దేశ విధానం మాత్రం మార‌దు. అమెరికాకు ఏమాత్రం హేతుబ‌ద్ధ‌త ఉన్నా స‌రే, మ‌రోసారి మా దేశంపై యుద్ధం చేయ‌బోదు అని పేర్కొన్నారు.

హార్ముజ్ జ‌ల‌సంధి, గ‌తంలో యుద్ధానికి ముందు ఉన్న నాటి స్థితిలోకి తిరిగి వెళ్ల‌దు. 40 రోజులు యుద్ధం జ‌ర‌గ‌క‌ముందు ఉన్న ప‌రిస్థితిలోకి జ‌ల‌సంధి వెళ్ల‌లేదు. ఇది ర‌మ‌దాన్ యుద్ధం. ఈ యుద్ధం ప్రాంతీయ భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ‌ల్ని త‌ల‌కిందులు చేసింది. ఈ ఘ‌ర్ష‌ణ కాల్పుల విర‌మ‌ణకే ప‌రిమితం కాకూడ‌దు. అన్ని రంగాల్లో యుద్ధం ముగియాలి. ఈ యుద్ధంలో అమెరికాకు చెందిన 80 యుద్ధ విమానాల్ని ధ్వంసం చేశాం. అన్నింటినీ మిస్సైల్స్ ద్వారానే కూల్చాం. ఈ ప్రాంతంలో ఉన్న అమెరికా బేస్‌లు అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. అలాగే, అక్క‌డి వంద‌లాది బిల్డింగుల‌ను ధ్వంసం చేశాం అని అరాగ్చీ పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events