చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో రూపొందిన చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు. సంక్రాంతి ఉత్సాహాన్ని మరింత పెంచుతూ వెంకటేష్ కీలక పాత్రతో నటిస్తున్నారు. ఇది అత్యంత క్రేజీ కాంబినేషన్‌లలో ఒకటి. మేకర్స్ తిరుపతిలో సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఇందులో చిరంజీవి కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్‌గా తనదైన శైలి వినోదాన్ని పండించారు. ఆయన కామెడీ టైమింగ్, పంచ్‌లు వింటేజ్ చిరుని గుర్తు చేశాయి. కథానాయిక శశిరేఖ (నయనతార), శంకరవరప్రసాద్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. చివరలో వెంకటేష్ ఎంట్రీ సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది.

చూస్తుంటే మంచి ఫ్యామిలీమ్యాన్‌లా ఉన్నావు, ఈ మాస్ ఎంట్రీ ఇస్తున్నావేంటి అని చిరు అడిగినప్పుడు మాస్‌కే బాస్‌లా ఉన్నావ్, నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి అని వెంకటేష్ చెప్పడం ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ లీడర్ రాజు, ఆటో జానీ వంటి పాత్రల్లో చిరంజీవి బాగా నచ్చుతారు. ఆ తరహాలో శంకరవరప్రసాద్ క్యారెక్టర్‌ను రాసుకున్నా. సంక్రాంతికి థియేటర్లలో ఓ ఉత్సవంలా ఉంటుందీ సినిమా. చిరంజీవి, వెంకటేష్ వంటి సూపర్‌స్టార్స్‌ను ఒకే ఫ్రేమ్‌లో చూడటం పండగలా అనిపిస్తుంది అన్నారు. సంక్రాంతికి బాక్సాఫీస్‌ను షేక్ చేసే చిత్రమవుతుందని నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల పేర్కొన్నారు.















