Skip to main content

Namaste NRI

అట్లాంటాలో ‘తానా’ (TANA) ‘సి.పి.ఆర్ అవగాహన మరియు శిక్షణ’ కార్యక్రమానికి విశేష స్పందన

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వివిధ కార్యక్రమాలను కమ్యూనిటీకోసం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తానా సౌత్ ఈస్ట్ విభాగంవారు అట్లాంటాలో నిర్వహించిన ‘సి.పి.ఆర్ అవగాహన మరియు శిక్షణ’ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. మార్చి 29న స్థానిక ‘అకేషన్స’ వేదికగా జరిగిన ఈ శిబిరానికి ఆ ప్రాంతంలో ఉన్న తెలుగువారు హాజరై ఆపత్కాలంలో చేయాల్సిన వైద్యచికిత్స చర్యలను తెలుసుకున్నారు.

హ్యాండ్స్-ఆన్ ప్రాక్టీస్ : ప్రముఖ వైద్యురాలు డాక్టర్ లలిత మేడెపల్లి తన బృందంతో కలిసి ఈ శిక్షణను అందించారు. గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక చికిత్సగా సి.పి.ఆర్ ఎలా చేయాలో ప్రత్యక్షంగా వివరించారు. ఇందులో పాల్గొన్న 50 మందికి పైగా సభ్యులకు బొమ్మల ద్వారా హ్యాండ్స్-ఆన్ ప్రాక్టీస్ చేయించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి వైద్య సహాయం అందే వరకు ప్రాణం నిలబెట్టే ఈ నైపుణ్యంపై అందరికీ అవగాహన కల్పించారు.

నాయకత్వం సమన్వయం:

తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, ఈవీపీ శ్రీని లావుల ప్రోత్సాహంతో, ఉమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్ సోహిని అయనాల ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ఈ సందర్భంగా తానా నాయకులు మాట్లాడుతూ, సమాజంలో ఆరోగ్య స్పృహ పెంచే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఈస్ట్ రీజినల్ రిప్రజెంటేటివ్ శేఖర్ కొల్లు, ఫౌండేషన్ ట్రస్టీ మధుకర్ యార్లగడ్డ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ భరత్ మద్దినేని, మాజీ అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, సోషల్ వెల్ఫేర్ కోఆర్డినేటర్ సునీల్ దేవరపల్లి తదితరులు పాల్గొన్నారు.

ఈ శిక్షణ కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన స్థానిక తానా ప్రతినిధులు మాలతి నాగభైరవ, పూలని జస్టి, ఆర్థక అన్నే, ఉప్పు శ్రీనివాస్, అనిల్ యలమంచిలి, కోటి కండిమల్ల, నరేన్ నల్లూరి, చైతన్య కొర్రపాటిల కృషిని నాయకత్వం అభినందించింది. వేదికను సమకూర్చిన కిషోర్ తాటికొండకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Click Here
Click Here

తాజా వార్తా చిత్రాలు

NRI Events