విదేశీ విద్యార్థులకు శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ సహకారం అందిస్తోందని వీసీ ఆచార్య జమున పేర్కొన్నారు. వర్సిటీ అంతర్జాతీయ సంబంధాల ఆధ్వర్యంలో యూఎస్ఏ, భారతదేశం మధ్య విద్య, సాంస్కృతిక, సంబంధాలు బలోపేతం చేయడం అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వీసీ ఆచార్య జమున, తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కోర్సులో అడ్వాన్స్డ్ డిప్లొమో పూరి చేసిన విద్యార్థుల మార్కుల జాబితాను వీసీ జమున తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరికి అందజేశారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక కన్వీనర్ చిగురుమళ్ల శ్రీనివాస్, విజయలక్ష్మి, లక్ష్మి, శారద పాల్గొన్నారు.