సీనియర్ సంగీత దర్శకుడు కోటి విలన్‌పాత్రలో నటిస్తున్న చిత్రం పగ పగ పగ. అభిలాష్ సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ వినోదాత్మకంగా కొనసాగే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. కోటీ పాత్ర అందరికి సర్‌ప్రైజింగ్‌గా వుంటుంది అన్నారు. బెనర్జీ, బీవీకే నాయకుడు, కరాటే కళ్యాణి, భరణి శంకర్, రాయల్ హరిశ్చంద్ర తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం మొదటి షోను అందరికి ఉచితంగా ప్రదర్శిస్తామని ఇటీవలే చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రానికి రవి శ్రీ దుర్గాప్రసాద్ దర్శకుడు. సత్యనారాయణ సుంకర నిర్మాత. ఈ నెల 22న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి సంగీతం: కోటి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)