పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి భారత్ కంటే మెరుగ్గా ఉన్నదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్‌లో ఇంటర్నేషనల్ చాంబర్స్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. పాక్‌లో ఇప్పటికీ జీవన వ్యయం చాలా చవక అని పేర్కొన్నారు. చాలా దేశాల్లో కంటే పాక్‌లో చమురు ధరలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. ప్రతిపక్షం అసమర్థ ప్రభుత్వం అంటూ విమర్మిస్తోంది. కానీ మా ప్రభుత్వం అన్ని సంక్షోభాల నుంచి దేశాన్ని కాపాడిరది అని తెలిపారు. ప్రతిపక్ష నేత పీఎంఎల్ ఎన్ అధ్యక్షుడు షెబాజ్ షరీఫ్ ఈ అంశాన్ని నేషనల్ అసెంబ్లీలో చర్చకు లేవనెత్తారు. ఒక వైపు అణుశక్తి దేశంగా ఉంటూ, మరోవైపు చిప్ప పట్టుకుని అడుక్కోవడం ఎలా సాధ్యమని ప్రభుత్వాన్ని నిలదీశారు. దేశ ఆర్థిక పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వం దివాలా తీయించిందని విమర్శించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)