Skip to main content

Namaste NRI

భారతీయులకు వీసా నిరాకరించిన పాకిస్థాన్‌

పాకిస్థాన్‌ లోని పవిత్ర క్షేత్రాలను సందర్శించాలనుకున్న 92 మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం వీసాలు నిరాకరించింది. ఖల్సా సజ్నా దివస్ వేడుకల్లో భాగంగా గురుద్వారా పంజా సాహిబ్‌ ను దర్శించుకునేందుకు వీరు సిద్ధమవగా, ఈ పరిణామం చోటుచేసుకుంది. 92 మంది భక్తుల పేర్ల చివర సింగ్ లేదా కౌర్ లేనప్పటికీ, వీరంతా పది మంది సిక్కు గురువులపై ప్రగాఢ విశ్వాసం ఉన్నవారని సుదీప్ సింగ్ పేర్కొన్నారు.

మొదట ఏప్రిల్ 10 నుంచి 19 వరకు వీరికి వీసాలు మంజూరు చేసిన పాకిస్థాన్, ఆ తర్వాత వాటిని రద్దు చేయడం భారతీయ కుటుంబాల మత విశ్వాసాలను దెబ్బతీసిందని సుదీప్‌ సింగ్‌ విమర్శించారు. హిందూ సమాజాన్ని గురుద్వారాల నుంచి దూరం చేసేందుకు పాకిస్థాన్ పన్నిన వ్యూహాత్మక చర్యగా ఇది కనిపిస్తోందని సుదీప్ సింగ్ ఆరోపించారు. హిందూ, సిక్కు కుటుంబాల మధ్య బంధాన్ని ఎవరూ విడదీయలేరని ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు సిక్కులపట్ల సానుభూతి నటిస్తూనే, మరోవైపు ఐఎస్ఐ ద్వారా భారత్‌లోకి డ్రగ్స్, ఆయుధాలు పంపిస్తోందని ఆయన ఆరోపణలు చేశారు.

Social Share Spread Message

Latest News