భారత్ చుట్టుపక్కల దేశాల్లో ఆర్థిక అస్థిరత ప్రబలుతోంది. ఇటీవల శ్రీలంక దివాలా తీయగా, తాజాగా పాకిస్థాన్ కూడా అదే బాట పట్టే ప్రమాదం ఉంది. కానీ, ఈ దేశం దివాలా తీసి, అస్థిరత ఏర్పడితే మన దేశం మరింత ముప్పును ఎదుర్కొనే ప్రమాదం ఉంది. మత ఛాందసవాదం ప్రబలడం, అక్కడి అణ్వస్త్రాలు తాలిబన్ మూకల చేతిల్లోకి వెళ్లే అవకాశాలున్నాయి. ఇప్పటికే ప్రతి నెలా పాక్ విదేశీ రిజర్వులు, అడగంటుతున్నాయి. ద్రవ్యోల్బణం గణనీయంగా పెరిగి లీటరు పాల ధర 260 పాకిస్థానీ రూపాయలుగా ఉంది. ఇక విద్యుత్ సంక్షోభం అత్యంత తీవ్రంగా ఉంది. వీటికి తోడుగా చైనా అప్పు ఉండనే ఉంది. దీనికి అదనంగా గత నెలాఖరున చైనా మరో 2.3 బిలియన్ డాలర్ల రుణం విదిల్చింది. దీని వడ్డీ రేటు మాత్రం పీఎంఎల్ `ఎన్ సర్కారు గోప్యంగా ఉంచింది. ఇవి దీర్ఘకాలిక పరిష్కారాన్ని చూపించలేవు. ఇలాంటివి గతంలో శ్రీలంకలో సంక్షోభానికి ముందు కనిపించిన పరిణామాలే. ఆర్థిక కష్టాల నుంచి బయటపడటానికి అక్కడి ప్రభుత్వం గాడిదల పెంపకం, ప్రజల టీ తక్కువ తాగడం వంటి విచిత్రమైన మార్గాలపై కూడా దృష్టి పెట్టింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)