ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతీయ రక్షణ దళాల దూకుడును అడ్డుకునేందుకు అమెరికా సహాయాన్ని పాకిస్థాన్ కోరింది. దీని కోసం ఆ దేశం తీవ్రంగా ల్యాబీయింగ్ చేసినట్లు తాజా ఆధారాలు బయటపడ్డాయి. వాషింగ్టన్‌లో అమెరికా పెద్దలను కలిసేందుకు పాకిస్థాన్ తీవ్ర ప్రయత్నం చేసింది. దౌత్యపరమైన రీతిలో అమెరికా సహాయాన్ని కోరింది. పాకిస్థానీ దౌత్యవేత్తలు, రక్షణ దళ అధికారులు ఇండియాను శాంతింపచేయడానికి అమెరికా హెల్ప్ కోరారు. సుమారు 50 సార్లు మీటింగ్‌లు నిర్వహించినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ చేపట్టే విధంగా పాకిస్థాన్ అధికారులు అమెరికాను వేడుకున్నట్లు తెలిసిందే. పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతీయ సైనిక దళాలు ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే.

అమెరికా ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్టులో దాఖలైన రికార్డుల ఆధారంగా పాకిస్తాన్ అధికారులు సుమారు 60 సార్లు అమెరికా అధికారులతో భేటీ అయినట్లు తెలుస్తున్నది. పాకిస్థాన్ అంబాసిడర్‌తో పాటు రక్షణాధికారులు ఈ-మెయిల్, ఫోన్లు, వ్యక్తిగతంగా అమెరికా అధికారులను కలిసినట్లు తెలుస్తోంది. భారత్ తన దాడిని ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని అమెరికాను పాక్ కోరినట్లు ఆ డాక్యుమెంట్లతో తెలిసింది















