Skip to main content

Namaste NRI

పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్

వివేక్‌ దండు హీరోగా పరిచయమవుతున్న చిత్రం పనసపల్లి ఫ్యాన్స్‌ అసోసియేషన్‌. గ్రామీణ నేపథ్యంలో పీరియాడిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. సి.హెచ్‌.రవికిషోర్‌ దర్శకుడు. సంగీర్తన విపిన్‌ కథానాయికగా నటిస్తున్నది. ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. పనసపల్లి అంటే సినీ ప్రియులకు కేంద్రం. కొత్త సినిమా విడుదలైందంటే ఊర్లో గోడలపై పోస్టర్స్‌ పడాల్సిందే.

హీరో పనసపల్లి మెగా కామ్రేడ్స్‌ ఫ్యాన్స్‌ అధ్యక్షుడు. మరోవైపు కథానాయిక బాలకృష్ణ అభిమాన సంఘం ప్రెసిడెంట్‌. వీరిద్దరు రికార్డులపై పోటాపోటీలు పడటం మోషన్‌ పోస్టర్‌లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఆద్యంతం చక్కటి వినోదంతో సాగే చిత్రమిదని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎల్‌.రాజా, రచన-దర్శకత్వం: సి.హెచ్‌.రవికిషోర్‌.

Social Share Spread Message

Latest News