Skip to main content

Namaste NRI

పాంచాలి పంచభర్తృక ప్రీరిలీజ్‌ ఈవెంట్‌

డా.రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫ్యామిలీ డ్రామా పాంచాలి పంచభర్తృక. సరీ ఫర్‌, లోల్‌ రిడా, రాజ్‌ పవన్‌, జెమినీ సురేశ్‌, వెంకట్‌ దుగ్గిరెడ్డి కీలక పాత్రధారులు. గంగ సప్తశిఖర్‌ దర్శకుడు. వెంకట్‌ దుగ్గిరెడ్డి, రాజ్‌ పవన్‌ శ్రీకాంత్‌ సెట్టివారి, సాయినాథ్‌ మణ్యం నిర్మాతలు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు.

ఈ సినిమా ఆద్యంతం వినోదాన్ని పంచుతుందని, తెలుగు రాష్ర్టాలతోపాటు అమెరికాలోనూ గ్రాండ్‌గా విడుదల కానున్నదని, నిర్మాతలు ప్యాషన్‌తో నిర్మించారని, జంధ్యాల, ఈవీవీ, అనిల్‌ రావిపూడి సినిమాల్లా ఈ సినిమాలోనూ తెర నిండా నటీనటులు ఉంటారని దర్శకుడు గంగ సప్తశిఖర తెలిపారు. ఇంకా సంగీత దర్శకుడు మహేశ్‌ నారాయణ, నటులు శ్రీనివాస్‌, థర్టీ ఇయర్స్‌ పృథ్వీ, బాల, యోగి, రాంకీ, నటి కుమారి అంటీ, కోడైరెక్టర్‌ రేష్మ కూడా మాట్లాడారు. ఈ నెల 14న సినిమా విడుదల కానున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events