Skip to main content

Namaste NRI

అమెరికా స్కూల్‌లో కాల్పుల కలకలం

అమెరికాలోని ఓరేగాన్ రాష్ట్రంలో దారుణం జ‌రిగింది. ఓ 16 ఏళ్ల వ్య‌క్తి కాల్పుల‌కు తెగించాడు. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు చిన్నారులు, ఓ టీచ‌ర్ మృతిచెందారు. ప్రైమ‌రీ స్కూల్‌లో ఈ ఘాతుకం జ‌రిగింది. అయితే ఆ ఉన్మాదిని మ‌రో వ్య‌క్తి హ‌త‌మార్చిన‌ట్లు పోలీసులు చెప్పారు. బెండ్ సిటీలో ఉన్న సిల్వ‌ర్ రైల్ ఎలిమెంట‌రీ స్కూల్‌లోకి అనుమానిత వ్య‌క్త దూసుకెళ్లాడు. అత‌ని పేరును పోలీసులు వెల్ల‌డించ‌లేదు. మృతిచెందిన పిల్ల‌ల వ‌య‌సు 11 ఏళ్ల లోపే ఉన్న‌ది. ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డ్డ 54 ఏళ్ల టీచ‌ర్ క్రిటిక‌ల్‌గా గాయ‌ప‌డింది. అయితే కాల్పులు జ‌రిపిన వ్య‌క్తికి, స్కూల్‌కు ఏదైనా సంబంధం ఉందా లేదా అన్న కోణంలో విచార‌ణ చేప‌డుతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events