పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం PVT04. ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రీ లీల నటిస్తోంది శ్రీకాంత్.ఎన్. రెడ్డి దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రచార చిత్రంతో పాటు చిత్ర విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు.
ఈ ప్రచార చిత్రంలో తీగల కంచె ఆవల అస్పష్టంగా కనిపిస్తూ హీరో నిలుచున్న తీరు, మరో వైపు కంచె తగలబడుతున్న వైనం ఆసక్తిని రేకెత్తిస్తోంది. వైష్ణవ్ తేజ్ ఈ లుక్‌తో సరికొత్తగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో ఆయన మాస్ అవతారంలో దర్శనమివ్వబోతున్నట్లుగా ఈ లుక్ క్లారిటీ ఇచ్చేస్తోంది. భారీస్థాయిలో నిర్మాణం జరుపుకుంటోన్న ఈ చిత్రం పూర్తి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని చిత్ర దర్శకనిర్మాతలు తెలుపుతున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తయిందని, టైటిల్, అలాగే చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నామని చిత్రయూనిట్ తెలిపింది. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని 29 ఏప్రిల్, 2023న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ఎడిటర్ : నవీన్ నూలి, సినిమాటోగ్రఫీ : డుడ్లే.