Namaste NRI

యూరప్‌ దేశాలను వణికిస్తున్న పారెట్‌ ఫీవర్‌

యూరప్‌ దేశాలు ప్యారట్‌ ఫీవర్‌తో  వణుకుతున్నాయి. ఆస్ట్రియా, డెన్మార్క్‌, జర్మనీ, స్వీడన్‌, నెదర్లాండ్స్‌లో ఈ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. ఈ వ్యా ధితో ఇప్పటి వరకు ఐదుగురు మృతిచెందారు. ఇన్ఫెక్ష న్‌కు గురైన పక్షుల ద్వారా మనుషులకు సోకే ఈ వ్యాధి శ్వాసకోశ వ్యాధులు, జ్వరం, తీవ్ర తలనొప్పి, పొడి దగ్గు, కండరాల నొప్పులకు కారణం అవుతున్నది. క్లామిడోఫిలా సిటాసి అనే బ్యాక్టీరియా సోకటం వల్ల ఈ వ్యాధి వస్తుంది. పౌల్ట్రీ, వెటర్నరీ విభాగాల్లో పనిచేసేవారికి, పక్షులను పెంచుకొనేవారు ఎక్కువగా ఈ వ్యాధికి గురవు తున్నట్టు వెల్లడిస్తున్నారు. బ్యాక్టీరి యా సోకిన 5-14 రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయని తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events