Namaste NRI

ఆది పినిశెట్టి, హన్సిక మోత్వాని జంటగా నటించిన పార్ట్‌నర్‌ ట్రైలర్‌

ఆది  పినిశెట్టి హీరో నటించిన చిత్రం పార్ట్‌నర్‌. మనోజ్‌ దామోదరన్‌ దర్శకత్వం. ఈ సినిమాలో ఆదికి జోడీగా హన్సిక మోత్వానీ, పాలక్‌ లల్వానీ నటిస్తున్నారు.  తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ రిలీజైంది. ట్రైలర్ చూస్తుంటే సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నట్లు తెలుస్తుంది. డబ్బు చాలా అవసరమై దొంగతనాలు చేసే కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండే ఆది, ఆయన ఫ్రెండ్‌ యోగిబాబుకు అనుకోకుండా ఓ అసైన్‌మెంట్‌ వస్తుంది. ఓ సైటింస్ట్‌ దగ్గర చిప్‌ దొంగతనం చేస్తే 20 లక్షలు ఇస్తామని చెప్పడంతో ఆది, యోగిబాబు దాని కోసం వెళ్తారు. అదే సమయంలో అనుకోకుండా ఓ మిషిన్‌లోంచి ఇంజక్షన్‌ వచ్చి యోగిబాబుకు గుచ్చుకుంటుంది. దాంతో అతను అమ్మాయి వేషంలో హన్సికలా మారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది. తిరిగి యోగిబాబు తన ఒరిజినల్‌ బాడీలోకి వచ్చాడా లేదా అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తుంది.   ఇదే కాన్సెప్ట్‌కు కావాల్సినంత హాస్యం జోడించినట్లు ట్రయిలర్‌ చూస్తే క్లియర్‌ కట్‌గా తెలిసిపోతుంది. థియేటర్‌కు వచ్చిన ఆడియెన్స్‌ను బోర్‌ కొట్టించకుండా ఎంటర్‌టైన్‌ చేస్తే మాత్రం సినిమా పాసవ్వడం ఖాయం. పైగా ఆదికి తెలుగులో మార్కెట్‌ పెంచుకోవడానికి ఇదే కరెక్ట్‌ బొమ్మ. సై-ఫై కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 25న పెద్ద ఎత్తున రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events