Skip to main content

Namaste NRI

పాస్‌పోర్ట్‌ ఫీజులు భారీగా పెంపు… జులై 1 నుంచి

కేంద్ర విదేశాంగ శాఖ (ఎంఈఏ) అన్ని క్యాటగిరీలకు చెందిన పాస్‌పోర్టుల ఫీజులను భారీగా పెంచింది. కొత్త ఫీజులు జూలై 1నుంచి అమలులోకి వస్తాయని జూన్‌ 20న జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ తెలిపింది. పాస్‌పోర్ట్‌(సవరణ) నిబంధనల కింద నోటిఫై చేసిన ఈ ఫీజు పెంపు అనేక సంవత్సరాల తర్వాత జరిగిన భారీ పెంపు. ఇప్పటివరకు అమల్లో ఉన్న ఫీజుల ప్రకారం 36 పేజీల పెద్దలకు చెందిన పాస్‌పోర్టు ఫీజు రూ.1,500, 60 పేజీల బుక్‌లెట్‌ ఫీజు రూ.2,000గా ఉంది.

పెద్దల విభాగంలో జారీ చేసే కొత్త లేదా పునరుద్ధరించిన 36 పేజీల పాస్‌పోర్టు సాధారణ ఫీజు రూ.1,500 నుండి రూ.2,500కు(అంటే 37 శాతం) పెరిగింది. అలాగే సాధారణ విభాగంలో 60 పేజీల పాస్‌పోర్టు ధర గతంలో ఉన్న రూ.2,000 నుండి రూ. 3,500(అంటే 75 శాతం) పెరిగింది. తత్కాల్‌ పథకం కింద దరఖాస్తు చేసుకునే వారికి 30 పేజీల పాస్‌పోర్టు రుసుము ఇక రూ. 5,000 ఉంటుంది. అలాగే 60 పేజీల తత్కాల్‌ పాస్‌పోర్టు ఫీజు రూ.6,000 ఉంటుంది. 18 ఏండ్ల లోపు వయసు గల మైనర్లకు సాధారణ విధానంలో కొత్త 36 పేజీల పాస్‌పోర్టు ఫీజు ఇప్పుడు రూ.1,750 కాగా తత్కాల్‌ రుసుము రూ.4.250గా నిర్ణయించారు.

Social Share Spread Message

Latest News