ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం పతంగ్. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడు. సంక్రాంతి సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. పతంగుల పోటీ నేపథ్యంలో రాబోతున్న స్పోర్ట్స్ డ్రామా ఇది. సికింద్రాబాద్ బస్తీలో కథ నడుస్తుంది. సహజత్వానికి దగ్గరగా ఆద్యంతం వినోదం, భావోద్వేగాల ప్రధానంగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతున్నది. వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: శక్తి అరవింద్, సంగీతం: జొస్ జిమ్మి, నిర్మాతలు: విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, దర్శకత్వం: ప్రణీత్ ప్రత్తిపాటి.
