Namaste NRI

పఠాన్‌ ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది..

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ నటిస్తున్న తాజా చిత్రం పఠాన్‌. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం స్పెయిన్‌లో కొనసాగుతుంది. షారుఖ్‌ ఖాన్‌తో పాటు దీపికా పదుకొనే, జాన్‌ అబ్రహాం లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పాటలతో పాటు కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పఠాన్‌ సెట్స్‌ నుంచి తన 8 ప్యాక్‌ యాబ్స్‌కు సంబంధించిన ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. షారుక్‌ కాస్త నెమ్మదించి ఉండొచ్చు.. పఠాన్‌ను ఎవరు ఆపగలరు? అంటూ దానికి వాఖ్య  రాశారు. పఠాన్‌ నుంచి షారుఖ్‌ ఖాన్‌ ఫస్ట్‌ లుక్‌ రావడంతో ఇదే తొలిసారి. ఈ చిత్రానికి సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది.  పటాన్‌ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events