పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు చిత్రం కోసం యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటున్నారు. ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో ఈ చిత్రీకరణ జరుగుతోంది. మేఘ సూర్య సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. హరిహరవీరమల్లు చిత్రం పిరియాడిక్ డ్రామాగా రూపొందుతోంది. ఇందులో బాలీవుడ్ నటులు అర్జున్ రాంపాల్, నర్గీష్ ఫక్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2023 వేసవిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒకవైపు రాజకీయాలు, మరోవైపు సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్‌ను లొకేషన్‌లో పలువురు సినీ ప్రముఖులు కలుసుకున్నారు. మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మాతలు, దర్శకుడు హరీష్ శంకర్ కలిసిన వారిలో ఉన్నారు. గబ్బర్‌సింగ్ తర్వాత పనన్‌తో మరో సినిమా చేసేందుకు హరీష్ శంకర్ సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన స్పష్టత రావాల్సి ఉంది.
