
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. చాలా రోజుల తర్వాత పవన్‌కి ఓజీ రూపంలో బ్లాక్ బస్టర్ రావడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఓజీ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్ చిత్ర దర్శకుడు సుజిత్ కు అద్భుతమైన బహుమతిని అందించారు. ఓజీ సాధించిన అద్భుత విజయానికి సంతోషించిన పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజిత్‌కు లగ్జరీ కారు ని బహుమతిగా ఇచ్చారు. ప్రముఖ కార్ల కంపెనీ లాండ్ రోవర్ కి చెందిన రేంజ్ రోవర్ లగ్జరీ కారుని సుజిత్‌కి గిప్ట్గా ఇచ్చాడు.















