Namaste NRI

ఆర్కే సాగర్‌ ది 100.. ట్రైలర్ లాంచ్‌ చేసిన పవన్‌కల్యాణ్‌

ఆర్కే సాగర్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ది 100.  మిషా నారంగ్‌ హీరోయిన్‌. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రానికి ఓంకార్‌ శశిధర్‌ దర్శకత్వం వహించారు. రమేష్‌ కరుటూరి, వెంకి పుషడపు నిర్మాతలు. ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను అగ్ర హీరో పవన్‌కల్యాణ్‌ ఆవిష్కరించారు. జీవితంలో జరిగిపోయింది మనం మార్చలేము, కానీ జరగబోయేదాన్ని ఖచ్చితంగా ఆపగలం అనే వాయిస్‌ ఓవర్‌తో ప్రారంభమైన ట్రైలర్‌ ఆసక్తికరంగా సాగింది.

ఈ సినిమాలో ఐపీఎస్‌ ఆఫీసర్‌ విక్రాంత్‌ పాత్రలో ఆర్కే సాగర్‌ కనిపించనున్నారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశమిదని, సస్పెన్షన్‌కు గురైన పోలీసాఫీసర్‌ సంఘ విద్రోహక శక్తుల్ని ఎలా అంతమొందించాడన్నదే ఇతివృత్తమని మేకర్స్‌ తెలిపారు. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకురానుంది.  ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్దన్‌ రామేశ్వర్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాఘవ్‌ ఓంకార్‌ శశిధర్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events