ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు యూఏఈ లో ఘనంగా జరిగాయి. గల్ఫ్ జనసేన పార్టీ నేషనల్ ఇన్‌ఛార్జ్ కేసరి త్రిమూర్తులు, కన్వీనర్లు ఎం చంద్రశేఖర్, సీహెచ్ రాందాస్ ఆధ్వర్యంలో పవన్ బర్త్ డే సెలబ్రేషన్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు అలరించాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, పార్టీ గాజువాక ఇన్‌ఛార్జ్ కోన తాతారావు, మాడుగుల ఇన్‌ఛార్జ్ రాయపురెడ్డి కృష్ణ హాజరయ్యారు.


ఈ కార్యక్రమంలో ప్రసంగించిన అతిధులు జనసేన బలోపేతానికి గల్ఫ్ విభాగం ఎంతో కృషి చేసిందన్నారు. గల్ఫ్ జనసేన ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిందని కొనియాడారు. నా సేనకు-నావంతు భాగంగా కోటి రూపాయలు విరాళం ఇచ్చారని గుర్తు చేశారు. జనసేన ఈ విజయం కైవసం చేసుకోవడానికి ఎన్నో అటుపోటు లను తట్టుకుని పార్టీ నిలిచిందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన నాయకులకు జాతీయ, ప్రాంతీయ కార్యదర్శులు, కార్యనిర్వాహక సభ్యులు, జనసేన వీరమహిళలను సన్మానం చేశారు. ఈ జన్మదిన వేడుకలు కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు, జన సైనికులు, వీరమహిళలు అలాగే పవన్ కళ్యాణ్ అభిమాను లు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు.
