Namaste NRI

పవన్-సాయి ధరమ్ తేజ్ మూవీ టైటిల్ ఖరారు.. ఫస్ట్ లుక్ మోషన్‌  పోస్టర్

పవన్‌కల్యాణ్‌,  సాయిధరమ్‌తేజ్‌తో కలిసి నటిస్తున్న తాజా చిత్రానికి బ్రో  అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. కేతికశర్మ, ప్రియాప్రకాష్‌, సముద్రఖని తదితరులు నటిస్తున్నారు.  తమిళంలో విజయవంతమైన వినోదాయ సీతమ్‌ చిత్రానికి రీమేక్‌ ఇది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్‌తో కలిసి టి.జి.విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించడంతో పాటు ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ మానవరూపంలో ఉన్న దేవుడి పాత్రలో కనిపించనున్నారు.

ఓ యువకుడికి వచ్చిన సమస్యను పరిష్కరించడానికి భువిపై అడుగుపెట్టిన దేవుడిగా పవన్‌కల్యాణ్‌ పాత్ర సాగనుంది. మోషన్‌ పోస్టర్‌లో ఆయన స్టెలిష్‌గా కనిపిస్తున్నారు. ఇంకా పదిరోజుల షూటింగ్‌ మాత్రమే మిగిలి ఉంది. జూలై 28న ఈ సినిమాను విడుదల చేయబోతున్నాం అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, సహనిర్మాత: వివేక్‌ కూచిభొట్ల.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events