Namaste NRI

శ్రీరామిన‌వ‌మి కానుక‌గా పెద్ది ఫ‌స్ట్ గ్లింప్స్ రిలీజ్

 గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్  ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం పెద్ది. జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌. బుచ్చిబాబు సానా దర్శకత్వం. ఉత్త‌రాంధ్ర స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుండ‌గా,  మైత్రీమూవీమేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో, వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్ప‌టికే ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన చిత్ర‌బృందం శ్రీరామిన‌వ‌మి కానుక‌గా ఫ‌స్ట్ గ్లింప్స్‌ను విడుద‌ల చేసింది.

ఫ‌స్ట్ షాట్‌ అంటూ ఈ వీడియోను విడుద‌ల చేయ‌గా,  ఒకటే పని చేయడానికి,  ఒకే లాగా బతకడానికి ఇంత పెద్ద బతుకెందుకు. ఏదేమైనా ఈ నెల మీద ఉన్నప్పుడే చేసేయాలి. పుడ‌తామా ఏంటి మ‌ళ్లీ అంటూ రామ్ చ‌ర‌ణ్ డైలాగ్‌తో ఈ గ్లింప్స్ సాగింది. ఇందులో రామ్ చ‌ర‌ణ్ గ‌ల్లీ క్రికెట‌ర్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. ఈ పాన్‌ఇండియా ప్రాజెక్ట్‌లో కన్న‌డ చ‌క్ర‌వ‌ర్తి శివ‌రాజ్ కుమార్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండగా, ఏఆర్ రెహ‌మాన్ ఈ సినిమాకు సంగీతం అందించ‌బోతున్నాడు. దివ్యేందు శర్మ ఇందులో విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events