బీజేపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పెద్దిరెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి వచ్చిన పెద్దిరెడ్డి అనుచరులు, కార్యకర్తలు భారీగా టీఆర్‌ఎస్‌లో చేరారు. నిరుపేద దళితుల, దేవాలయ భూములను ఆక్రమించి, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్‌ను బీజేపీలో చేర్చుకోవటాన్ని నిరసిస్తూ పెద్దిరెడ్డి ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు.