Namaste NRI

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు

టోక్యో ఒలింపిక్న్‌లో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఒలింపిక్న్‌ నుంచి దేశానికి తిరిగి వచ్చిన అనంతరం ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులను కలిసిన ఆమె తిరుమలకు విచ్చేసింది. ఈ సందర్భంగా పీవీ సింధుకు అర్చకులు ఘనస్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం పీవీ సింధు మీడియాతో మాట్లాడుతూ యువ క్రీడాకారుల కోసం త్వరలోనే విశాఖలో అకాడమీని ప్రారంభిస్తానని తెలిపింది. యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తే దేశానికి మరిన్ని పతకాలు వస్తాయని, అందుకే వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కోవిడ్‌ సమయంలో ప్రజలందరూ తప్పకుండా వ్యాక్సిన్‌ వేసుకోవాలని పీవీ సింధు సూచించింది.

Social Share Spread Message

Latest News