పెప్సికో కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ సైతం ఉద్యోగులను తొలగించే ప్రయత్నాల్లో ఉన్నది. పెప్సికో ఇంక్ న్యూయార్క్‌లోని ప్రధాన కార్యాలయంలోని స్నాక్ అండ్ బేవరేజెస్ యూనిట్ల నుంచి వంద మందికి పైగా ఉద్యోగులను తొలగించే యోచిస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఉద్యోగుల తొలగింపుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఉద్యోగులకు పంపిన మెమోలో సంస్థను సరళీకృతం చేయడం ద్వారా మరింత సమర్థవంతంగా పని చేయవచ్చని కంపెనీ తెలిపినట్లు తెలిసింది. స్వచ్చంద పదవీ విరమణ కార్యక్రమాలతో పాటు స్నాక్స్ యూనిట్ ఇప్పటికే తొలగింపులు చేపట్టారని, దీంతో పాటు బేవరేజెస్ బిజినెస్‌లో భారీగా కోతలుంటాయని పలువురు పేర్కొంటున్నారు.