అమెరికా రాజకీయాల్లో భారత సంతతి కమ్యూనిటీ ప్రభావం పెరుగుతున్నది. నలుగురు ఇండో-అమెరికన్ చట్టసభ సభ్యులు కీలకమైన మూడు యూఎస్ హౌస్ కమిటీల్లో సభ్యులుగా నియమితులయ్యారు. వీరిలో ప్రమీలా జయపాల్, అమిబెరా, రాజా కృష్ణమూర్తి, రోఖన్నా ఉన్నారు. ఇమ్మిగ్రేషన్పై హౌస్ జ్యుడీషియరీ కమిటీ ప్యానెల్లో 57 ఏండ్ల జయపాల్ చోటు దక్కించుకొన్నారు. ఈమె అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన దక్షిణాసియాకు చెందిన మొదటి వ్యక్తి కావడం గమనార్హం. అమిబెరాను సెలెక్ట్ కమిటీ ఆన్ ఇంటెలిజెన్స్, కృష్ణమూర్తి, రోఖన్నాలను చైనా వ్యవహారశైలికి సంబంధించి వివిధ అంశాలను పర్యవేక్షించే కమిటీలో సభ్యులుగా నియమించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)