ఫిలిప్పీన్స్ వెళ్లేవారికి ఇది శుభవార్త లాంటిదే. ఎందుకంటే దాదాపు రెండు సంవత్సరాల అనంతరం విదేశీ ప్రయాణికులపై ఆంక్షలను ఫిలిప్పీన్స్ పూర్తిగా తొలగించింది. దీంతో దేశ టూరిజానికి పునరుజ్జీవం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకొని, కొవిడ్ నెగెటివ్ ఉన్న ప్రయాణికులు దేశంలోకి రావచ్చని, వీరికి ఎలాంటి క్వారంటైన్ అవసరం లేదని తెలిపింది. అలాగే ఆయా దేశాలను రిస్కువారీగా విభజించే విధానాన్ని కూడా నిలిపివేసింది.