పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి మృతి పట్ల తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాడ సంతాపాన్ని తెలియజేశారు. సీతామహాలక్ష్మి 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా గత సంవత్సరం డిసెంబర్‌లో నెలలో తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ జనార్థన్ నిమ్మలపూడితో కలిసి మాచర్ల వెళ్లి తానా సంస్థ తరపున ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె జ్ఞాపికను బహుహకరిండం తమ అదృష్టం అన్నారు. ఆ సందర్బంగా ఆమె చూపిన ప్రేమ, వాత్సల్యం, పింగళి వెంకయ్య మనవడు, రచయిత అయిన జి విఎన్ నరసింహం వారి ఇతర కుటుంబ సభ్యులతో గడిపిన మధుర క్షణాలు అమూల్యం అని తానా అధ్యక్షులు అలావు అంజయ్య చౌదరి గుర్తు చేసుకొన్నారు.
