
విశాఖలో యోగాంధ్ర కార్యక్రమం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు యోగాసనాలు వేశారు. అంతకు ముందుమోదీ యోగా స్మారక పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. యోగా ఫర్ వన్ ఎర్త్.. వన్ హెల్త్ నినాదంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. విశాఖ ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు యోగాసనాలు వేశారు.కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీఎత్తున తరలివచ్చారు.



