ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. వాషింగ్టన్ డీసీలో ఉన్న శ్వేతసౌధంలో ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోదీకి విందు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బైడెన్ దంపతులకు అరుదైన కానుకలను మోదీ అందజేశారు. జో బైడెన్‌కు గంధపు చెక్కతో చేసిన ఓప్రత్యేక బాక్స్‌ను అందించగా, ప్రథమ మహిళ జిల్‌కు మాత్రం ప్రత్యేకమైన గ్రీన్ డైమండ్‌ను కానుకగా ఇచ్చారు. ఈ 7.5 క్యారెట ్ల గ్రీన్ డైమండ్‌ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ల్యాబ్‌లో తయారు చేశారు. ఒక క్యారెట్ వజ్రాన్ని తయారు చేయడానికి 0.028గ్రాముల కార్బన్ మాత్రమే విడుదలవుతుంది. దీన్ని జెమొలాజికల్ ల్యాబ్ కూడా ధ్రువీకకరించింది. వజ్రానికి ఉండే నాలుగు ప్రధాన లక్షణాలైన కట్, కలర్,క్యారెట్, క్లారిటీలను ఇది కలిగి ఉంటుంది. భూమిలో లభించే సహజమైన వజ్రం మాదిరిగానే దీనికి రసాయన, ఆప్టికల్ లక్షణాలు ఉంటాయి. దీని తయారీలో సౌర, పవన శక్తి వనరులను ఉపయోగించినందున ఇది పర్యావరణ అనుకూలమైనదిగా పేర్కొన్నారు. ఈ వజ్రాన్ని ఉంచిన చిన్న బాక్సును కూడా ప్రత్యేకంగా తయారు చేశారు. కాగితం గుజ్జుతో చేసిన ఈ బాక్స్‌పై కశ్మీరీ కళాకారులు వివిధ డిజైన్లను వేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-126-4-205.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/45af6911-9449-466d-a7e1-ba146800284b-124-4-204.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/638bff07-efd2-4cc9-8546-98039833db3c-132-4-205.jpg)