ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ట్వీట్ చేశారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా ఏపీ సీఎం జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. సీఎం జగన్ సుఖం శాంతులతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా అని ట్వీట్ చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)