ఇటీవల ఘన విజయం సాధించిన పుష్ప చిత్రంలో జాలిరెడ్డి పాత్రలో నటించిన ధనుంజయ్ నటించిన కన్నడ చిత్రం బడవరాస్కెల్. ఇప్పుడు ఈ చిత్రాన్ని డాలీపిక్చర్స్ అండ్ రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు అదే పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. నిర్మాత సావిత్రమ్మ అడవి స్వామి మాట్లాడుతూ ఆసక్తికరమైన కథ, కథనాలతో రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. కన్నడలో ఘన విజయం సాధించిన చిత్రమిది. ధనుంజయ్ మాస్ పాత్రలో ఆకట్టుకున్నారు. ఆయన హంగామా తప్పకుండా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తుంది. త్వరలోనే విడుదల తేదీని వెల్లడిస్తామని సినీ వర్గాలు తెలిపాయి. అమృత అయ్యంగార్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ : గీత శివరాజ్‌కుమార్. ఛాయాగ్రహణం : ప్రీతా జయరామన్.