అమెరికాలో పోలీస్ పెట్రోలింగ్ కారు ఢీకొనడంతో మృతి చెందిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల(23)కు మరణాంతరం డిగ్రీ ఇవ్వాలని ఆమె చదివిన నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ నిర్ణయించింది. ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన జాహ్నవి 2021లో సౌత్ లేక్ యూనియన్‌లోని నార్త్‌ఈస్ట్రన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీలో చేరారు. ఈ ఏడాది జనవరి 23న ఆమె నడుచుకుంటూ వెళ్తుండగా మితిమీరిన వేగంతో వచ్చిన పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొనడంతో ఆమె మృతి చెందారు. జాహ్నవి మృతిపై సంతాపం వ్యక్తం చేసిన యూనివర్సిటీ వీసీ ఆమెకు మరణాంతరం డిగ్రీ ప్రదానం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.
